
Advertise on podcast: TALRadio Telugu
This podcast has
978 episodes
Language
TeluguPublisher
Touch A Life FoundationExplicit
No
Date created
2022/01/31
Latest episode
2026/10/15
Average duration
30 min.
Release period
2 days
Description
This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.
Unlock TALRadio Telugu podcast Email contact info,
Listeners & Audience details
Email contact information
Direct podcast contact details

Listeners
Audience numbers & engagement insights

Audience details
Podcast Insights

Podcast episodes
Check latest episodes from TALRadio Telugu podcast
SIPs & మ్యూచువల్ ఫండ్స్‌లో సరిగ్గా ఇన్వెస్ట్ చేయడం ఎలా? |Smart Money Mindset - 13
2026/10/15
Mutual Fundsలో పెట్టుబడి పెట్టాలంటే.. ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి!
చాలామందికి Mutual Fundsలో పెట్టుబడి పెట్టాలని ఉంటుంది. కానీ అసలు ఇవి సురక్షితమేనా? ఏ ఫండ్స్ ఎంచుకోవాలి? SIP ద్వారా పెట్టుబడి పెడితే ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి? అనే సందేహాలు ఉంటాయి. అందుకే.. ఈ వారం Smart Money Mindset – Telugu పాడ్‌కాస్ట్‌లో Financial Educator & Money Mindset Coach మాధవి లత గారు Mutual Funds, SIPల గురించి మనతో పంచుకున్నారు.
SIP ద్వారా పెట్టుబడిని ఎలా మొదలు పెట్టాలి? మనకు సరిపోయే మ్యూచువల్ ఫండ్స్‌ను ఎలా ఎంచుకోవాలి? ఒకేసారి పెట్టుబడి పెట్టడం మంచిదా, SIP ద్వారా పెట్టడం మంచిదా? Direct, Regular ఫండ్స్ మధ్య తేడా ఏంటి? ఇలాంటి ఎన్నో సందేహాలకు మాధవి లత గారు ఈ ఎపిసోడ్లో సమాధానాలు చెప్పారు.
కాబట్టి, Mutual Fundsలో పెట్టుబడి పెట్టే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడానికి ఈ పాడ్‌కాస్ట్‌ను తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి!
Investing in mutual funds can raise several questions, such as which funds to choose, how safe they are, and what benefits SIPs offer.
In this week’s Smart Money Mindset – Telugu podcast, Financial Educator and Money Mindset Coach Madhavi Latha shares valuable insights into mutual funds and SIP investments.
She explains how to start investing through SIPs and choose funds that suit our financial goals.
The episode also explores the differences between lump-sum investments and SIPs, as well as Direct and Regular mutual funds.
Tune in to learn the essential things to know before investing in mutual funds and make more informed financial decisions!
Host: Madhavi Latha
Source: https://www.youtube.com/@Smartmoneymindsettelugu
#TALRadioTelugu #MutualFunds #SIPInvestment #SmartMoneyMindset #FinancialLiteracy #PersonalFinance #TouchALife #TALRadio
కష్టాలని ఎదురించి .. పదిమందికి తోడుగా నిలిచిన అమ్మ | అంతరంగాలు - 9
2026/10/14
ఎన్ని కష్టాలు ఎదురైనా.. తనను నమ్మిన వారందరికీ అండగా నిలిచారు!
చిన్న వయసులోనే పెళ్లి అయింది.. ఆ తర్వాత కూడా చదువును కొనసాగించాలనే పట్టుదలతో ఇంటర్, డిప్లొమా పూర్తి చేశారు భ్రమరాంబ గారు. ఉద్యోగం చేస్తూ నలుగురు పిల్లలను పెంచి, చదివించి, వారిని జీవితాల్లో స్థిరపడేలా చేశారు. ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఎవరి మీదా ఆధారపడకుండా తన కాళ్ల మీద తాను నిలబడ్డారు.
కొడుకు దూరమయ్యాక.. కోడలు, మనవరాళ్ల బాధ్యతలను కూడా తన భుజాలపై వేసుకున్నారు. కోడలు తన జీవితంలో ముందుకు సాగేందుకు తోడ్పడుతూ.. ఆమెను ఒక ఓల్డేజ్ హోమ్ ను నిర్వహించేలా ప్రోత్సహించారు. కుటుంబంలో ఎదురైన కష్టాలను ధైర్యంగా ఎదుర్కొంటూ.. అందరినీ కలిపి ఉంచిన భ్రమరాంబ గారి ప్రయాణం ఎంతో స్ఫూర్తిదాయకం.
మరి ఇంకా భ్రమరాంబ గారి జీవితంలో ఎదురైన సవాళ్లు ఏంటి? వాటిని ఆమె ఎలా ఎదుర్కొన్నారు? కుటుంబాన్ని నిలబెట్టుకుంటూ తన ప్రయాణాన్ని ఎలా కొనసాగించారు?
తెలుసుకోవడానికి ఈ వారం ‘అంతరంగాలు’ పాడ్‌కాస్ట్ ను తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి!
Despite facing numerous challenges in life, Bhramaramba garu stood strong and became a pillar of support for her family. Married at a young age, she remained determined to continue her education and completed her Intermediate and Diploma courses. While working, she raised and educated her four children, helping them become independent and establish themselves in life. Her determination and self-reliance helped her overcome hardships without depending on others.
After the loss of her son, she took responsibility for supporting her daughter-in-law and granddaughters. She encouraged her daughter-in-law to move forward in life and supported her in managing an old-age home. Through every challenge, Bhramaramba garu remained a source of strength, keeping her family united with courage and compassion. Tune in to this week’s ‘Antharangalu’ podcast to discover more about her inspiring life journey, the challenges she faced, and how she overcame them with resilience and determination.
Guest: గుండ్లూరి భ్రమరాంబ
డైరెక్టర్ ,
అనురాగ నిలయం
Host: డా|| శోభా పేరిందేవి
#TALRadioTelugu #Antharangalu #InspirationalLifeJourney #WomenEmpowerment #FamilyStrength #TouchALife #TALRadio
వరంగల్ యువకుడు .. ఆకాశవాణి నుంచి అమెరికా వరకు.. | మా ఊరు - 84
2026/10/12
కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటేనే.. జీవితంలో ఎన్నో కొత్త దారులు కనిపిస్తాయి!
వరంగల్‌లో చిన్న చిన్న అవకాశాలతో మొదలైన సదానందం గారి ప్రయాణం.. ఆకాశవాణి నుంచి టెలివిజన్ వరకు, మెడికల్ రిప్రజెంటేటివ్ ఉద్యోగం నుంచి ఐటీ రంగం వరకు, వరంగల్ నుంచి అమెరికా వరకు సాగింది.
చిన్నతనంలోనే ట్యూషన్లు చెప్పడం, ఆకాశవాణిలో పని చేయడం, మెడికల్ రిప్రజెంటేటివ్‌గా కెరీర్ మొదలుపెట్టి మేనేజర్‌గా ఎదగడం.. ఇలా ప్రతి దశలోనూ కొత్త విషయాలను నేర్చుకుంటూ ముందుకు వెళ్లారు. చిత్రకళ, మిమిక్రీ, జర్నలిజం వంటి రంగాల్లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అమెరికాలో ఐటీ ప్రొఫెషనల్‌గా పనిచేస్తూనే ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా కొనసాగుతున్న ఆయన.. కుటుంబ బాధ్యతలను నిర్వర్తిస్తూనే చదువుకొని మాస్టర్స్ పూర్తి చేశారు.
విభిన్న రంగాల్లో ఆయన చేసిన ప్రయాణం, మీడియాతో ఏర్పడిన అనుబంధం, కెరీర్లో వచ్చిన మార్పులు, జీవితంలో నేర్చుకున్న పాఠాలు.. ఇలా ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వారం ‘మా ఊరు’ కార్యక్రమంలో మనతో పంచుకున్నారు సదానందం గారు!
ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి, కొత్త అవకాశాన్ని అందిపుచ్చుకోవడానికి వయసుతో సంబంధం లేదని చెప్పే ఈ స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని అస్సలు మిస్ అవ్వకండి.. తప్పకుండా వినండి!
Sadanandam’s inspiring journey from Warangal to the USA reflects how continuous learning, adaptability, and passion can open doors to new opportunities. From media and journalism to IT, his story reminds us that it’s never too late to learn, grow, and explore new paths in life.
Guest: సదానందం
IT Professional
Freelance Journalist
Host: Usha
#TALRadioTelugu #InspiringJourney #LifelongLearning #CareerGrowth #MaaOoru #TouchAlife #TALRadio
పాలియేటివ్ కేర్ అంటే ఏమిటి? | Health Talk | World Hospice and Palliative Care Day Special
2026/10/12
అనారోగ్యంతో ఉన్నవారికి మనోధైర్యం కూడా చాలా ముఖ్యం!
దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్నవారు శారీరకంగానూ, మానసికంగానూ చాలా ఒత్తిడిని కూడా ఎదుర్కొంటుంటారు. అలాంటి సమయంలో వారికి వ్యాధి నుంచి కాస్త ఉపశమనం కల్పిస్తూనే, రోజువారీ జీవితాన్ని వీలైనంత సౌకర్యవంతంగా గడిపేలా చేయడమే Palliative Care యొక్క ముఖ్య ఉద్దేశం. అంతే కాకుండా, వారి కుటుంబ సభ్యులకు అవసరమైన మద్దతును అందించడం కూడా చాలా ముఖ్యం.
మరి అసలు Palliative Care అంటే ఏమిటి? ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఇది అవసరం? ఇంటి దగ్గరే ఈ సేవలు ఎలా అందిస్తారు? రోగులకు, వారి కుటుంబ సభ్యులకు ఈ సంరక్షణ ఎలా ఉపయోగపడుతుంది? ఇలాంటి ఎన్నో ముఖ్యమైన విషయాలను ఈ వారం Health Talk కార్యక్రమంలో మనతో పంచుకున్నారు.. Pain Relief and Palliative Care Societyకి చెందిన Palliative Care Physician, Home Care Chief Medical Officer Dr. Sai Prajwal Reddy గారు!
ఆరోగ్య సంరక్షణలో Palliative Care ప్రాముఖ్యతను తెలుసుకోవడానికి ఈ పాడ్‌కాస్ట్ ను తప్పకుండా వినండి.. మిస్ అవ్వకండి!
Palliative care plays a vital role in improving the quality of life of people living with chronic and serious illnesses. Along with managing pain and other symptoms, it focuses on providing emotional and mental support, helping patients lead their daily lives with greater comfort and dignity. Supporting family members and helping them cope with the challenges of caregiving are also important aspects of palliative care.
In this week’s Health Talk program, Dr. Sai Prajwal Reddy, Palliative Care Physician and Home Care Chief Medical Officer at Pain Relief and Palliative Care Society, explains what palliative care is, who needs it, how home-based care services work, and how they benefit both patients and their families. Tune in to this informative podcast to understand the importance of palliative care and the compassionate support it offers!
Host : Adarsh Kumar
Guest : Dr.Sai Prajwal Reddy Adapala
Cheif Medical Officer
Pain Relief and Pallivative Care Society, Hyderbad
Website :https://palliativecarepartners.in/
#TALRadioTelugu #PalliativeCare #HealthTalk #HealthcareAwareness #PatientCare #QualityOfLife #TouchALife #TALRadio
మధ్యతరగతి వాళ్లు రిచ్ అవ్వడానికి సింపుల్ టిప్స్ ! | Smart Money Mindset - 12
2026/10/08
జీతం ఎంతైనా సరే.. సంపద పెంచుకోవడానికి ఈ 5 విషయాలు ముఖ్యం!
చాలామంది రోజుకు 10–12 గంటలు పనిచేస్తారు.. సంపాదిస్తారు.. కొంత దాచుకుంటారు. కానీ మన సమయం, నైపుణ్యాలు, డబ్బును సరైన దిశలో ఉపయోగిస్తున్నామా? లేదా? అనేదే అసలు ప్రశ్న.
అందుకే.. ఈ వారం Smart Money Mindset - Telugu పాడ్‌కాస్ట్‌లో Naval Ravikant ఆలోచనల ఆధారంగా సంపదను నిర్మించుకోవడానికి ఉపయోగపడే 5 ముఖ్యమైన విషయాల గురించి మనతో పంచుకున్నారు.. Financial Educator & Money Mindset Coach మాధవి లత గారు!
సరైన నిర్ణయాలు తీసుకోవడం.. లాంగ్టర్మ్గా ఆలోచించడం.. Leverageను ఉపయోగించుకోవడం.. మనకున్న ప్రత్యేకమైన నైపుణ్యాన్ని గుర్తించడం.. ముఖ్యంగా Compoundingకు సమయం ఇవ్వడం.. ఇవన్నీ మన ఆర్థిక జీవితంలో ఎలాంటి మార్పు తీసుకురాగలవో ఈ ఎపిసోడ్లో వివరించారు.
మన knowledge, skillsతో మరింత value ను ఎలా create చేయాలి? చిన్న చిన్న పనులు చేస్తూ వాటి ప్రభావాన్ని ఎలా పెంచుకోవాలి?
ఈ విషయాల గురించి తెలుసుకోవడానికి ఈ పాడ్‌కాస్ట్‌ను తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి!
No matter how much you earn, building wealth depends on how wisely you use your time, skills, and money. In this episode of Smart Money Mindset – Telugu, Financial Educator & Money Mindset Coach Madhavi Latha shares five key principles inspired by Naval Ravikant for building long-term wealth.
From making better decisions and thinking long-term to identifying your unique skills, using leverage, and giving compounding enough time, the episode explores how small, smart actions can create greater value and lasting financial growth.
Discover how to turn your knowledge and skills into value, multiply the impact of your efforts, and develop a mindset that can help you build wealth over time. Don’t miss this insightful episode!
Host: Madhavi Latha
Source: https://www.youtube.com/@Smartmoneymindsettelugu
#TALRadioTelugu #SmartMoneyMindset #WealthBuilding #FinancialEducation #MoneyMindset #PersonalFinance #TouchALife #TALRadio
రేడియో వెనుక ఆసక్తికరమైన ప్రపంచం! | Special Interview With Hari Madugula
2026/10/08
రేడియో అనేది..కేవలం పాటలు, వార్తలు వినడానికి మాత్రమే కాదు… ప్రపంచాన్ని అన్వేషించడానికి కూడా ఒక అద్భుతమైన మార్గం!
మనకు దూరంగా ఉన్న దేశాలు, భాషలు, సంస్కృతులను రేడియో తరంగాల ద్వారా తెలుసుకోవచ్చు. ఒక చిన్న రేడియో రిసీవర్‌తో ప్రపంచంలోని దూర ప్రాంతాల నుంచి వచ్చే సిగ్నల్స్‌ను వినడం వెనుక ఉన్న ఆసక్తి, ఉత్సాహం నిజంగా ప్రత్యేకమైనది!
Shortwave Listening, DXing, Amateur Radio, SDR, Digital Radio… ఇలా రేడియో ప్రపంచంలో ఎన్నో ఆసక్తికరమైన అంశాలు ఉన్నాయి. మొబైల్, ఇంటర్నెట్ యుగంలోనూ రేడియోను ఒక హాబీగా కొనసాగిస్తున్న ఎంతోమంది రేడియో ప్రేమికులు ఇప్పటికీ ఉన్నారు!
దశాబ్దాలుగా రేడియో అభిరుచిని కొనసాగిస్తూ… రేడియో ప్రేమికులను ఒకే వేదికపైకి తీసుకువస్తున్న Young Stars Radio Club గురించి ఈ ప్రత్యేక సంభాషణలో తెలుసుకుందాం!
మరి రేడియో హాబీని ఎలా మొదలుపెట్టాలి? యువత ఈ రంగంలోకి ఎలా రావాలి? Traditional Radio నుంచి Digital Radio వరకు రేడియో ప్రపంచం ఎలా మారుతోంది? మొబైల్, ఇంటర్నెట్ యుగంలోనూ రేడియోకు ఉన్న ప్రత్యేకత ఏమిటి? వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలుసుకోవచ్చు!
తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి!
Radio is much more than a medium for listening to songs and news—it can be a fascinating way to explore the world. From Shortwave Listening and DXing to Amateur Radio, SDR, and Digital Radio, the world of radio offers countless opportunities for curiosity, learning, and discovery. Even in the age of smartphones and the internet, many enthusiasts continue to keep radio as a meaningful hobby.
In this special conversation, we explore the journey and activities of the Young Stars Radio Club, which brings radio enthusiasts together on one platform. Discover how to start radio as a hobby, how young people can get involved, how radio has evolved from traditional to digital formats, and why radio continues to remain relevant in the digital age.
Host : Bharath
Guest : Hari Madugula
#TALRadioTelugu #RadioHobby #YoungStarsRadioClub #AmateurRadio #ShortwaveListening #DigitalRadio #TouchALife #TALRadio
సంగీతం గెలిపించిన జీవితం | అంతరంగాలు - 08
2026/10/06
సంగీతమే తన జీవితంగా మారింది... తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది!
చిన్నప్పటి నుంచే సంగీతంపై ఆసక్తితో.. కర్ణాటక సంగీతం నేర్చుకుని, 24 ఏళ్లకే మ్యూజిక్ డైరెక్టర్‌గా అడుగుపెట్టారు అనిల్ కుమార్ గారు. ఎన్నో ఆల్బమ్స్, సినిమాలు, సీరియల్స్‌కు సంగీతం అందించి.. నంది అవార్డును కూడా అందుకున్నారు.
కానీ.. అనుకోని పరిస్థితుల్లో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు ఎదురై.. కొంతకాలం సంగీతానికి దూరమయ్యారు. అలాంటి సమయంలో ఆయనకు అండగా నిలిచిన వ్యక్తుల సహకారంతో.. మళ్లీ తన సంగీత ప్రయాణాన్ని కొనసాగించారు.
మరి అనిల్ కుమార్ గారి సంగీత ప్రయాణం ఎలా మొదలైంది? ఆయన జీవితంలో ఎదురైన సవాళ్లు ఏంటి? తిరిగి తన ప్రయాణాన్ని ఎలా కొనసాగించారు?
తెలుసుకోవడానికి ఈ వారం ‘అంతరంగాలు’ పాడ్‌కాస్ట్ ను తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి!
Music became the defining journey of Anil Kumar Garu’s life. His passion for music began in childhood, leading him to learn Carnatic music and enter the world of music direction at just 24. He went on to compose music for albums, films and television serials, and was also honoured with the prestigious Nandi Award.
However, unexpected financial and health challenges forced him to step away from music for a period. With the support of people who stood by him during those difficult times, he found the strength to restart his musical journey.
Discover Anil Kumar Garu’s inspiring journey, the challenges he faced, and how he found his way back to music on this week’s ‘Antharangalu’ podcast. Don’t miss it!
Guest: Anil Kumar
Host: Dr. Gurajada Shobha Perindevi
#TALRadioTelugu #Antharangalu #ShobhaPerindevi #AnilKumar #MusicJourney #InspiringStories #TALRadio
విశాఖపట్టణం లో మా స్కూల్ చాలా బావుంటుంది ! | మా ఊరు - 83
2026/10/05
మనం ఎక్కడికి వెళ్లినా… చిన్ననాటి జ్ఞాపకాలు, అప్పటి అనుభవాలు మనతోనే ప్రయాణిస్తాయి!
అంటూ... ఈ వారం ‘మా ఊరు’ పాడ్‌కాస్ట్ లో ప్రీతి మునగపాటి గారు తమ చిన్ననాటి జ్ఞాపకాలను, విశాఖపట్నంతో తనకున్న అనుబంధాన్ని, జీవిత ప్రయాణాన్ని మనతో పంచుకున్నారు.
భీమవరంలో పుట్టి విశాఖపట్నంలో పెరిగిన ప్రీతి గారు.. ప్రకృతి అందాల మధ్య ఉన్న విశాఖవల్లి స్కూల్లో చదువుకున్న రోజుల గురించి, చిన్నప్పటి స్నేహితులు, చుట్టూ ఉన్న వాతావరణం, కుటుంబం నుంచి నేర్చుకున్న విలువలు తన వ్యక్తిత్వంపై చూపిన ప్రభావం.. ఇలాంటి ఎన్నో విషయాలను మనతో పంచుకున్నారు.
ప్రస్తుతం ప్రీతి గారు.. IT, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగాల్లో తన కెరీర్‌ను కొనసాగిస్తూ, SS Trustnet ద్వారా కుటుంబాల ఆర్థిక లక్ష్యాలకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఫైనాన్షియల్, రిటైర్మెంట్ ప్లానింగ్‌తో పాటు ఇన్సూరెన్స్, నాయకత్వ అభివృద్ధి, కొత్త వ్యాపారవేత్తలకు మెంటరింగ్ వంటి విభిన్న అంశాల్లో తన అనుభవాలను పంచుకున్నారు.
In this week’s Maa Ooru podcast, Preethi Munagapati takes us through her childhood memories, her deep connection with Visakhapatnam, and the values that shaped her life and personality. She also shares insights from her journey in IT and financial services, including financial planning, leadership, and mentoring entrepreneurs.
Guest: Preethi Munagapati.
Financial Advisor
Host: Usha
#TALRadioTelugu #MaaOoru #ChildhoodMemories #Visakhapatnam #LifeJourney #FinancialPlanning #TouchALife #TALRadio
చిన్న పిల్లల బోన్ హెల్త్ - తప్పక తెలుసుకోవలిసిన విషయాలు ! | Health Talk
2026/10/05
పిల్లల ఎముకల విషయంలో తల్లిదండ్రులకు సరైన అవగాహన ఉండటం చాలా ముఖ్యం!
పిల్లల ఎముకలు పెద్దవాళ్ల ఎముకలకంటే కొంచెం భిన్నంగా ఉంటాయి. అవి ఎదుగుదల దశలో ఉండటంతో గాయాలను తట్టుకునే విధానం కూడా వేరుగా ఉంటుంది. ఆడుకునే సమయంలో పడిపోవడం, చేతులకు గాయాలు అవ్వడం, ఫ్రాక్చర్ లాంటి సందర్భాల్లో కనిపించే కొన్ని లక్షణాలను తల్లిదండ్రులు గమనించడం అవసరం.
ముఖ్యంగా పిల్లలను చేతి మణికట్టు దగ్గర పట్టుకుని లాగడం వల్ల వచ్చే సమస్యలు, పిల్లలకు గాయాలు అయినప్పుడు ఇంట్లో చేయకూడని పనులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల ఎదుగుదలలో పోషకాహారం, Vitamin D ప్రాముఖ్యత వంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు.. ఈ వారం హెల్త్ టాక్ పాడ్‌కాస్ట్ లో మనతో పంచుకున్నారు.. ప్రముఖ Pediatric Orthopedician Dr. A.V. Anand గారు!
తప్పకుండా వినండి.. మిస్ అవ్వకండి!
Learn essential tips on children’s bone health, common injuries, fractures, and precautions parents should take. Pediatric Orthopedician Dr. A.V. Anand also explains the importance of nutrition and Vitamin D for healthy growth.
Guest: Dr. A.V. Anand, Pediatric Orthopedic Surgeon, Apollo Hospitals
Host: Kalyani
#TALRadioTelugu #ChildHealth #PediatricOrthopedics #BoneHealth #VitaminD #ParentingTips #TouchALife #TALRadio
24 గంటల ఈ ఛాలెంజ్‌తో.. మీ జీవితమే మారిపోవచ్చు! | Smart Money Mindset - 11
2026/10/01
జీవితంలో మార్పు రావాలని కోరుకుంటాం.. కానీ ఆ మార్పు కోసం మన అలవాట్లను, ఆలోచనలను మార్చుకోవడం మాత్రం మర్చిపోతుంటాం. మనం ఎలా ఉంటె.. మన జీవితం కూడా అలాగే మారుతుంది!
అందుకే.. ఈ వారం Smart Money Mindset - Telugu పాడ్‌కాస్ట్‌లో Financial Educator & Money Mindset Coach మాధవి లత గారు 24-Hour Reset Strategy గురించి మనతో పంచుకున్నారు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో అలా కేవలం ఒక 24 గంటలు ఆలోచించి, ప్రవర్తించి చూడండి.. ఆ చిన్న ప్రయత్నమే మీలోని మార్పుకు ప్రారంభం కావచ్చు.. అంటున్నారు.
మరి ఈ 24 గంటల్లో ఏం చేయాలి? మీ Identityని ఎలా మార్చుకోవాలి? పాత అలవాట్లను ఎలా దాటుకొని ముందుకు వెళ్ళాలి? తెలుసుకోవడానికి ఈ పాడ్‌కాస్ట్‌ను తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి!
Just 24 hours.. one new identity, one new beginning!
We all want to change our lives.. but real change starts when we change ourselves. In this Smart Money Mindset - Telugu podcast, Financial Educator & Money Mindset Coach Madhavi Latha shares the 24-Hour Reset Strategy, a simple way to start behaving like the person you want to become.
What should you do during these 24 hours? How can you break old habits and build a new identity? Tune in to find out!
Host: Madhavi Latha
Source: https://www.youtube.com/@Smartmoneymindsettelugu
#TALRadioTelugu #SmartMoneyMindset #MoneyMindset #24HourChallenge #PersonalGrowth #SelfImprovement #Mindset #Discipline #GrowthMindset #TouchALifeFoundation
అనుభూతులే ఆమె అక్షరాలు | పి. ఇంద్రాణి | మన రచయితలు S2 - 4
2026/10/01
10 ఏళ్ల వయసులోనే కవితలు రాయడం మొదలుపెట్టారు..
ఇప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తూనే.. 7 పుస్తకాలు రాశారు!
చిన్నప్పుడు ఇంట్లో సాహిత్య వాతావరణంలో పెరిగిన ఇంద్రాణి పాలపర్తి గారు.. కేవలం 10 ఏళ్ల వయసులోనే తన రచనా ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. ఆ తర్వాత చదువు, ఉద్యోగం, అమెరికా జీవితం.. ఇలా ఎన్ని బాధ్యతలు తనపై పడ్డా తెలుగు సాహిత్యంపై తనకు ఉన్న ఇష్టాన్ని మాత్రం వదులుకోలేదు.
ఇప్పటివరకు 7 పుస్తకాలు రచించారు. ‘వానకు తడిసిన పువ్వు’ తో ప్రారంభమైన ఆమె సాహిత్య ప్రయాణంలో.. ప్రకృతి, మనిషి అనుభూతులు, తన చుట్టూ కనిపించే జీవితాన్ని కవిత్వంగా మలుస్తూ ముందుకు సాగుతున్నారు.
చిన్నప్పుడు రాసిన తొలి కవిత నుంచి.. అమెరికా చలిలో రాసిన ‘శీతకాలపు రాత్రి’ వరకు.. ఆమె చుట్టూ కనిపించే జీవితమే ఆమె రచనలకు ప్రేరణగా మారింది.
మరి ఒక Healthcare Economistగా పనిచేస్తూనే.. రచయితగా తన ప్రయాణాన్ని ఎలా కొనసాగిస్తున్నారు? చిన్నప్పుడే కవిత్వం వైపు ఆమెను నడిపించిన కుటుంబ వాతావరణం ఎలా ఉంది? ఉద్యోగం, వ్యక్తిగత జీవితం మధ్య సాహిత్యానికి సమయం ఎలా కేటాయిస్తున్నారు? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వారం ‘మన రచయితలు’ కార్యక్రమంలో మనతో పంచుకున్నారు.. ఇంద్రాణి పాలపర్తి గారు!
Indrani Palaparthi began writing poetry at the age of 10, inspired by the literary environment she grew up in. Today, while working as a Healthcare Economist in the USA, she has authored seven books, continuing her passion for Telugu literature alongside her professional and personal responsibilities.
From her debut book Vaanaku Tadisina Puvvu to poems inspired by nature, human emotions, and everyday life—including Sheetakaalapu Raatri—her surroundings have remained a constant source of inspiration. In this episode of Mana Rachayithalu, Indrani shares her literary journey, her family’s influence, and how she balances her career and life in America with her passion for writing.
Host : Renusree
Guest : Indrani.P
#TALRadioTelugu #ManaRachayithalu #TeluguLiterature #TeluguWriters #PoetryJourney #WomenWriters #TouchALife #TALRadio
చిన్నారుల కోసం రంగుల ప్రపంచం - Art2Heart Foundation | స్ఫూర్తి కిరణాలు
2026/10/01
హాస్పిటల్ అంటే.. ఇంజక్షన్స్, మందులు, ట్రీట్మెంట్ ఇవే గుర్తొస్తాయి…! కానీ.. చుట్టూ రంగు రంగుల గోడలు, ప్రకృతి దృశ్యాలు, అందమైన బొమ్మలు.. ఉంటే?
ముఖ్యంగా.. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న చిన్నారులకు ఇలాంటి వాతావరణం ఎంతో ఉపయోగపడుతుంది.
Art2Hearts Foundation చేస్తున్న ప్రయత్నం కూడా ఇదే.
పిల్లల కోసం పనిచేసే ఆసుపత్రులతో కలిసి.. వారి అవసరాలకు, అక్కడి వాతావరణానికి తగ్గట్టుగా ఆర్ట్‌వర్క్స్‌ను సేకరించి, Pediatric Wardsలో ఏర్పాటు చేస్తోంది. ఎంతో మంది ఆర్టిస్టులు donate చేసిన వారి ఆర్ట్ ఫామ్స్ ను.. ఇంటి గోడలకే పరిమితం చేయకుండా, ఆసుపత్రిలో ఉన్న చిన్నారులకు ఒక సరికొత్త వాతావరణాన్ని పరిచయం చేస్తున్నాయి.
Art2Hearts Foundation డైరెక్టర్ పార్లే అనూష గారు.. ఆసుపత్రులతో కలిసి ఎలా పనిచేస్తున్నారు? ఆర్టిస్టుల నుంచి వారి ఆర్ట్‌వర్క్స్‌ను ఎలా సేకరిస్తున్నారు? ఒక ఆర్ట్‌వర్క్ చిన్నారులపై ఎలాంటి ప్రభావం చూపగలదు? ఇలాంటి ఎన్నో విషయాలను ఈ పాడ్‌కాస్ట్ లో మనతో పంచుకున్నారు.
ఆర్ట్ ద్వారా హాస్పిటల్ వాతావరణంలో మార్పు తీసుకురావాలనే ఈ అందమైన ప్రయత్నం గురించి తెలుసుకోవడానికి.. ఈ వారం ‘స్ఫూర్తి కిరణాలు’ కార్యక్రమాన్ని తప్పకుండా వినండి… మిస్ అవ్వకండి!
Art2Hearts Foundation is transforming hospital environments for children by bringing art, colour, and creativity into pediatric wards. In collaboration with children’s hospitals, the foundation collects artworks donated by artists and installs them based on the needs and surroundings of each hospital. In this podcast, Art2Hearts Foundation Director Parle Anusha shares how the organization works with hospitals and artists, and how art can create a more positive and comforting environment for children undergoing treatment.
Host : Adarsh Kumar
Guest : Anusha ,
Director For India ,
Art2heart Foundation.
Website :https://art2hearts.org/
#TALRadioTelugu #Art2Hearts #ChildrensHealthcare #HealingThroughArt #PediatricCare #ArtForChange #TouchALifeFoundation #TALRadio
గిరిజనుల కోసం అన్నం , అక్షరం , ఆరోగ్యం | అంతరంగాలు - 07
2026/09/29
గిరిజన ప్రాంతాల అభివృద్ధే ఈయన లక్ష్యం!
విశాఖపట్నంలోని King George Hospital చుట్టూ పెరిగిన రామ్ కుమార్ గారు.. చిన్నప్పుడే గిరిజన ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలను, వారి కుటుంబాలను, జీవన విధానాన్ని దగ్గరగా చూశారు. ఆ గిరిజనులకు తమ తల్లిదండ్రులు చేస్తున్న సహాయం ఆయనపై ఎంతో ప్రభావం చూపింది.
ఆ స్ఫూర్తితో ఉద్యోగం చేస్తూనే 2016లో Robin Hood Armyలో వాలంటీర్‌గా చేరి.. అవసరమైన వారికి ఆహారం అందిస్తూ సహాయం చేశారు.
కానీ, ఇంకా గిరిజన ప్రాంతాల ప్రజలకు ఎదురవుతున్న సమస్యలను దగ్గరగా చూశారు. దీంతో.. అక్కడే నిరంతరం పనిచేయాలని నిర్ణయించుకుని, 2021లో కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి Samaritans for the Nation అనే సంస్థను ప్రారంభించి.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని గిరిజన ప్రాంతాల్లో కూడా ఆరోగ్యం, విద్య, ప్రాథమిక అవసరాల కోసం పనిచేస్తున్నారు.
మరి అసలు.. చిన్నప్పుడు వారి తల్లి దండ్రుల నుండి వచ్చిన స్ఫూర్తి.. ఎలా తన సేవా ప్రయాణంగా మారింది? గిరిజన ప్రాంతాల్లో ఇంకా ఆయన చేస్తున్న కార్యక్రమాలు ఏంటి?
తెలుసుకోవడానికి ఈ వారం ‘అంతరంగాలు’ podcast ను తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి!
Ram Kumar grew up around King George Hospital in Visakhapatnam and was deeply influenced by his parents’ efforts to help tribal communities. Inspired by their service, he began volunteering with the Robin Hood Army in 2016 while continuing his career.
After witnessing the challenges faced by tribal communities more closely, he decided to dedicate himself to long-term service. In 2021, he founded Samaritans for the Nation along with his family and friends. The organization now works across tribal regions in Andhra Pradesh, Telangana, and other states, focusing on healthcare, education, and basic needs.
This episode of “Antharangalu” explores how childhood experiences shaped Ram Kumar’s journey of service and the impactful work he continues to do for tribal communities.
Guest: Smt. Chandrakala
Host: Dr. Gurajada Shobha Perindevi
#TALRadioTelugu #Antharangalu #TribalDevelopment #SocialService #CommunityService #SamaritansForTheNation #InspiringJourney #TouchALife #TALRadio
అప్పులు తీర్చడానికి సులభమైన మార్గాలు ఇవే! | Smart Money Mindset - Telugu - 10
2026/09/24
లోన్ తీసుకోవడం చాలా సులభం.. కానీ దాని నుంచి బయటపడటానికే సరైన ప్లాన్ ఉండాలి!
మనలో చాలామంది ఏదో ఒక అవసరం కోసం లోన్ తీసుకుంటాం. కానీ ఒక్కోసారి పరిస్థితులు మారినప్పుడు.. ఉద్యోగం పోవడం, ఆదాయం తగ్గడం, ఎక్కువ EMIలు ఉండటం, క్రెడిట్ కార్డ్ బిల్లులు పెరగడం వంటి కారణాలతో లోన్ భారం పెరిగిపోతుంది. అప్పుడు ఏ లోన్ ముందు తీర్చాలి? ఖర్చులను ఎలా తగ్గించుకోవాలి? EMIలను ఎలా మేనేజ్ చేయాలి? అనే విషయాల్లో చాలామందికి అవగాహన ఉండదు.
అందుకే… ఈ Smart Money Mindset - Telugu పాడ్‌కాస్ట్‌లో ప్రముఖ Financial Educator & Money Mindset Coach మాధవి లత గారు.. లోన్ భారం నుంచి బయటపడేందుకు ఉపయోగపడే ఎన్నో practical tipsను వివరించారు.
కొత్త లోన్లు తీసుకోకుండా ఉండటం, మన Assets, Liabilities, Income, EMIలను ఒకచోట రాసుకుని పూర్తి క్లారిటీతో ఉండటం, ఎక్కువ వడ్డీ ఉన్న లోన్లను ముందుగా తీర్చడం, EMIల కోసం ప్రత్యేకంగా ఒక అకౌంట్ ను ఏర్పాటు చేసుకోవడం, ఎక్కువ లోన్లను ఒకే లోన్‌గా మార్చుకునే ముందు వడ్డీని పరిశీలించడం వంటి ఎన్నో విషయాలను ఈ పాడ్‌కాస్ట్ లో తెలుసుకోవచ్చు.
లోన్ భారం ఎంత ఉన్నా.. సరైన ప్లాన్‌తో ఒక్కో అడుగు ముందుకు వేస్తే దాని నుంచి బయటపడే మార్గం కచ్చితంగా దొరుకుతుంది.
మరి అసలు లోన్స్ ను ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఏ లోన్‌ను ముందుగా తీర్చాలి? ఖర్చులు, EMIలు, ఆదాయాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? తెలుసుకోవడానికి ఈ పాడ్‌కాస్ట్‌ను తప్పకుండా వినండి.. మిస్ అవ్వకండి!
Taking a loan may be easy.. but getting out of it requires a proper plan!
Many of us take loans for one reason or another. But when situations change.. losing a job, a drop in income, multiple EMIs, or increasing credit card bills can make the loan burden much harder to manage. At such times, many people may not know which loan to repay first, how to cut down expenses, or how to manage their EMIs effectively.
That’s why, in this Smart Money Mindset - Telugu podcast, renowned Financial Educator & Money Mindset Coach Madhavi Latha shares several practical tips to help manage loans and gradually reduce the financial burden.
From avoiding new loans, keeping a clear record of your Assets, Liabilities, Income and EMIs, prioritising high-interest loans, and maintaining a separate account for EMIs to carefully evaluating the interest rate before consolidating multiple loans into one.. this podcast covers several useful ways to manage loans better.
No matter how much the loan burden is.. with the right plan and by taking one step at a time, there is always a way forward.
So, how can you manage your loans? Which loan should you repay first? How can you balance your expenses, EMIs and income? Tune in to this podcast to learn more.. Don’t miss it!
Host: Madhavi Latha
Source: Smart Money Mindset - Telugu
#TALRadioTelugu #SmartMoneyMindset #MoneyManagement #DebtManagement #LoanManagement #FinancialEducation #PersonalFinance #FinancialWellness #MoneyMindset #EMI #FinancialPlanning #DebtFree #MoneyTips #TouchALifeFoundation
మాతృదేవోభవ - ఓ తల్లి నిజ జీవిత కథ! | Chandrakala | అంతరంగాలు - 6
2026/09/22
‘మాతృదేవోభవ’ సినిమాను గుర్తు చేసే ఓ తల్లి కథ ఇది…!
తన పిల్లల్లో కొందరికి ఆరోగ్య సమస్యలు వచ్చాయి. వారి కోసం చంద్రకళ గారు ఎన్నో కష్టాలు పడ్డారు. పిల్లలను చూసుకుంటూ.. వారి ఆరోగ్యం కోసం కూడా ఎంతో శ్రమించారు. ఈ కష్టాల మధ్యే.. తన పిల్లలకు ఎదురైన పరిస్థితి మరో కుటుంబానికి రాకూడదని అనుకున్నారు. అలా తనకు చేతనైన సాయం చేస్తూ ముందుకు వెళ్తున్నారు.
అమ్మ పడిన కష్టాలను దగ్గరగా చూసిన ఆమె కుమారుడు రవికుమార్ గారిపైనా ఆ ప్రభావం పడింది. అమ్మను చూసి.. తానూ సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వచ్చారు. ముఖ్యంగా Muscular Dystrophyతో జీవిస్తున్నవారికి, వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు.
అవసరంలో ఉన్నవారికి సాయం చేయడంతో పాటు.. రక్తదానం, అవయవదానం, యోగా వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. Muscular Dystrophy గురించి మరింత మందికి అవగాహన కల్పిస్తూ.. ఈ సమస్యతో జీవిస్తున్న కుటుంబాలకు అవసరమైన సహాయం అందేలా కృషి చేస్తున్నారు.
ఓ తల్లి తన పిల్లల కోసం మొదలుపెట్టిన పోరాటం.. ఆ తర్వాత మరెంతో మందికి ఎలా అండగా మారింది? చంద్రకళ గారు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి? రవికుమార్ గారి సేవా ప్రయాణం ఎలా మొదలైంది?
తెలుసుకోవడానికి ఈ వారం ‘అంతరంగాలు’ పాడ్‌కాస్ట్ ను తప్పకుండా వినండి! మిస్ అవ్వకండి!
This is the story of a mother that reminds us of the movie Maatrudevobhava…!
Some of Chandrakala garu’s children faced health challenges, and she went through many struggles to take care of them and support their well-being. Amidst all these difficulties, she decided that no other family should have to go through what hers did. That’s when she began helping others in whatever way she could.
Watching his mother’s struggles closely also had a deep impact on her son, Ravikumar garu. Inspired by her, he too chose to dedicate himself to service. Today, he is especially supporting people living with Muscular Dystrophy and their families.
Along with helping those in need, he conducts initiatives such as blood donation, organ donation awareness, and yoga programs. He is also working to create greater awareness about Muscular Dystrophy and ensure that families living with the condition receive the support they need.
How did a mother’s fight for her children become a source of support for so many others? What challenges did Chandrakala garu face? And how did Ravikumar garu begin his journey of service?
Tune in to this week’s ‘Antharangalu’ podcast to know their inspiring story. Don’t miss it!
Guest: Smt. Chandrakala
Host: Dr. Gurajada Shobha Perindevi
#TALRadio #Antharangalu #Chandrakala #RaviKumar #MuscularDystrophy #SocialService #CommunityService #RareDiseaseAwareness #BloodDonation #OrganDonation #InspiringStories #Motherhood #TouchALifeFoundation
Podcast reviews
Read TALRadio Telugu podcast reviews
Podcast sponsorship advertising
Start advertising on TALRadio Telugu relevant audience podcasts
You may also like to advertise on these Podcasts

4.8224751791
The Andrew Klavan Show
The Daily Wire

4.858201918
Sara Gonzales Unfiltered
Blaze Podcast Network

4.942031993
Chente Ydrach
Chente Ydrach

4.7106592000
FantasyPros - Fantasy Football Podcast
iHeartPodcasts

4.7278232000
The Matt Walsh Show
The Daily Wire

4.922672003
First15 Devotional
First15

4.890611563
Fearless with Jason Whitlock
Blaze Podcast Network

4.827601703
Earn Your Happy
Lori Harder | YAP Media

4.8104512000
Steve Deace Show
Blaze Podcast Network

4.861421104
The David Pakman Show
David Pakman